Bantumilli: బంటుమిల్లి మండలం కోర్లపాడు గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హిందూ స్మశాన వాటికను ఘనంగా ప్రారంభించిన పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు. గ్రామ ప్రజల చిరకాల అవసరాన్ని గుర్తించి, కర్మకాండలు నిర్వహించేందుకు అనువైన వాతావరణంతో ఈ స్మశాన వాటికను అభివృద్ధి చేయడం జరిగింది. కర్మకాండలు నిర్వహించేందుకు ప్రత్యేక షెల్టర్లు, అస్థికల నిల్వ కోసం ప్రత్యేక ప్రదేశాలు వంటి అవసరమైన మౌలిక వసతులను ఇందులో ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన వసతులను కల్పిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కోర్లపాడు గ్రామ ప్రజలకు ఎంతోకాలంగా అవసరమైన స్మశాన వాటిక నిర్మాణం పూర్తై, నేడు ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’