Shorts Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కదిరి పట్టణం 26వ వార్డుకు చెందిన ముస్లిం మైనార్టీలకు చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో పార్టీలో చేరిన వారిని టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పనిచేస్తున్నారని, ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు