Kaizer News

Ainavilli: పెదపాలెం వద్ద ద్విచక్ర వాహనం చోరీ

Ainavilli: పెదపాలెం వద్ద ద్విచక్ర వాహనం చోరీ

· State - Telangana · hmtvlive.com

Shorts ​అయినవిల్లి: మండల పరిధిలోని అయినవిల్లి పెదపాలెం వద్ద ద్విచక్ర వాహనం అపహరణకు గురైనట్లు బాధితుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ​బాధితుడు పాము లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం... ఆయన ఒకరి ఇంటి పని నిమిత్తం పెదపాలెం వచ్చి, తన సుజుకి యాక్సిస్ (Two-Wheeler) నం.AP07 DY 3064 బండిని రహదారి పక్కన పార్క్ చేసి లోపలికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి బయటకు వచ్చి చూసేసరికి పార్క్ చేసిన వాహనం కనిపించలేదు. ​గుర్తుతెలియని వ్యక్తులు తన వాహనాన్ని అపహరించుకుపోయినట్లు గుర్తించిన లక్ష్మణ్, వెంటనే పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News