Kaizer News

అంధ భక్తులకు అది సాధ్యం కాదు

అంధ భక్తులకు అది సాధ్యం కాదు

· National - India · sakshi.com

దేశం నుంచి ద్వేషాన్ని తొలగించగలిగేది విద్యార్థులే విద్యార్థులు ప్రశ్నించడం అంధ భక్తులకు ఇష్టం లేదు ‘ఛాత్రోం కీ గూంజ్‌’లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజం ఇండోర్‌: దేశం మొత్తాన్ని ఒక ‘వ్యవస్థ’తన గుప్పిట్లోకి తీసుకుందని, విద్యార్థులు ప్రశ్నలు అడగడం దానికి ఇష్టం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ చుట్టూ ఉండే వ్యక్తులు ప్రజా జీవనంలో అనేక అంశాలను నిర్దేశిస్తున్నారని విమర్శించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సమాచార మారి్పడిని నియంత్రించడంతోపాటు గూఢచర్యానికి పాల్పడ్డారని ఆక్షేపించారు. విద్యార్థులు తమ చుట్టూ ఏం జరుగుతోందో ప్రశి్నస్తూ ఆ వ్యవస్థకు సవాలుగా నిలిచారని చెప్పారు. శనివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ‘ఛాత్రోం కీ గూంజ్‌’లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. దేశం నుంచి ద్వేషాన్ని తొలగించగలిగేది విద్యార్థులు మాత్రమేనని చెప్పారు. అంధ భక్తులకు అది సాధ్యం కాదని పరోక్షంగా బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. విద్యార్థులే భారతదేశ భవిష్యత్తు అని తేల్చిచెప్పారు. విద్యార్థులు ప్రశ్నలు అడగడాన్ని అంధ భక్తులు వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు జిజ్ఞాస, ప్రేమ, వినయం, సహనం, నిజాయితీ వంటి సద్గుణాలను కలిగి ఉంటారని, అంధభక్తుడికి ఈ సద్గుణాలన్నీ లోపిస్తాయని, అతను ద్వేషాన్ని వ్యాపింపజేస్తాడని వ్యాఖ్యానించారు. విద్యార్థులతో రాహుల్‌ గాంధీ సంభాషించారు. విద్య, ఉపాధి అవకాశాలపై చర్చ జరిగింది. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News