Kaizer News

Chirala: చీరాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సీపీఆర్ శి

Chirala: చీరాలలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సీపీఆర్ శిక్షణ!

· State - Telangana · hmtvlive.com

Chirala: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, చీరాల సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ కమ్యూనిటీ భవనం నందు ప్రధమ చికిత్స, సి పి ఆర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా శిక్షణ పొందిన 40 మందికి మండల తహసీల్దార్ శ్రీ గోపి కృష్ణ సర్టిఫికెట్ లను అందించారు. తహసీల్దార్ గోపి కృష్ణ మాట్లాడుతూ సమాజ సేవ లో ముఖ్యంగా వైద్య పరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం గొప్ప విషయమని, ప్రతి ఒక్కరు రెడ్ క్రాస్ జీవిత సభ్యత్వం తీసుకోవడం ద్వారా సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ బూదరాజు శశి కిరణ్ మాట్లాడుతూ ప్రధమ చికిత్స మరియు సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలు విస్తృత పరుస్తున్నట్లు, అందులో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులకు న్యాయస్థాన సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ పి. శ్రీమన్నారాయణ, ఉపాధ్యక్షురాలు శ్రీమతి సూరంపల్లి తేజస్వి, కార్యదర్శి జి. ఏ. వి. ప్రసాద్, మేనేజింగ్ కమిటీ సభ్యులు పూర్ణచంద్ర రావు, దమ్ము విజయ్ భాస్కర్, పసుపుల వందనం, తడవర్తి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు సూరంపల్లి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News