Kaizer News

సైతాను సయ్యాట.. ఈ రచయిత ప్రత్యేకత ఇదే!

సైతాను సయ్యాట.. ఈ రచయిత ప్రత్యేకత ఇదే!

· State - Telangana · sakshi.com

పోస్టల్‌ స్టాంపులు సేకరించే ఆసక్తి వున్న ఫిలాటెలిస్టులకు బాగా తెలిసిన పేరు ‘మాగ్యార్‌ పోస్ట’ హంగేరియన్‌ పోస్టల్‌ స్టాంపులను అలా పిలుస్తారు. హంగేరియన్‌ జాతీయులను కూడా మాగ్యార్లనడం కద్దు. యూరప్‌ నడిమధ్యలో, తూర్పు–పడమరలను కలిపే ప్రాంతంలో పుట్టి, నల్ల సముద్రంలో కలుస్తుంది డాన్యూబ్‌. ఆ నదీపరీవహక ప్రాంతం పొడుగునా విస్తరించిన దేశం హంగరీ. దాని జనాభా ప్రస్తుతం కోటికి కొంచెం అటూ–యిటూగా వుంటుంది. జాతుల కూర్పు విషయానికి వస్తే, చరిత్రకు తెలిసిన నాటినుంచి హంగరీ బహుళజాతీయ రాజ్యంగానే వుంటోంది! అదే అక్కడ సంకీర్ణ సంస్కృతి అభివృద్ధి చెందడానికి దారి తీసింది. అదే, హంగరీలో ఎందరో మహారచయితలు జన్మించి, ప్రపంచ ప్రసిద్ధి పొందడానికి సైతం కారణమయింది. పదమూడో శతాబ్దికి చెందిన సిమోన్‌ ఆఫ్‌ కేజా బహుశా వారందరిలోకీ ప్రాచీనుడు. ఇరవై ఒకటో శతాబ్ది ప్రథమ పాదం ముగియనుండగా నోబెల్‌ సాహిత్యపురస్కారం గెల్చుకున్న ల్యాజ్లో క్రాజ్నహార్కయ్‌ బహుశా ఈ తరానికి కూడా తెలిసిన బహుముఖ ప్రజ్ఞావంతుడు. ల్యాజ్లో అంటే మహారాజు, చక్రవర్తి లాంటి అర్థాలు చెప్తున్నాయి నిఘంటువులు. నవలాకారుడిగానూ, సినిమా స్క్రిప్టుల రచయితగానూ సుప్రసిద్ధుడు ల్యాజ్లో. ఆయన కొన్ని యాత్రా చరిత్రలు సైతం రాశారు. ఎవరో, ఆయన్ని వ్యాకులాత్ముడిగా చిత్రించారు– అందులో ఆవ గింజంతైనా అతిశయోక్తి లేదు! ల్యాజ్లో నవలల్లో భవిష్యత్తు మీద ఆశ కలిగించే లక్షణం దాదాపు శూన్యం. వర్తమానం పట్ల నిరాశనూ, నిర్వేదాన్నీ పెంచే ఆ క్షణమే ల్యాజ్లో నవలల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పేరుపొందిన ఆయన నవలల జాబితాలో ‘సైతాను సయ్యాట’, ‘ప్రతిఘటన–వ్యాకులత’, ‘హోమర్‌ వేట’, ‘అదిగో అడుగున అమృతమూర్తి’ ప్రముఖంగా కనిపిస్తాయి. ‘నింగి నీడలో విధ్వంసం–విషాదం’ పేరిట ల్యాజ్లో తన చైనా–మంగోలియా యాత్రానుభవాలను గ్రంథస్థం చేశారు. ఈ పుస్తకాలన్నిటి గురించి చెప్పుకోవడం సాధ్యం కాదు కానీ, ల్యాజ్లో విశిష్ట రచనారీతికి ప్రాతినిధ్యం వహించే కొన్ని రచనల గురించి క్లుప్తంగానైనా ప్రస్తావించుకోవడం భావ్యమేమో! నోబెల్‌ సాహిత్యపురస్కారాన్ని 2025లో గెల్చుకోవడానికి 40 యేళ్ళకు ముందు ల్యాజ్లో రచించిన నవల ‘సైతాను సయ్యాట’. అదే ఆయన తొలి నవల కూడా. ఈ నవల నిత్యాధునికవాదం అనే పోస్ట్‌–మాడర్నిస్ట్‌ రచనా ధోరణికి చెందిందంటారు. ఇందులో ఇతివృత్తం (లాంటిది) ఒకటే కానీ, కథనం మాత్రం అనేక కోణాలనుంచి జరుగుతుంది. ఇది లోకానికి తెలియని కథన రీతేం కాదు– 1950లో అకిరా కురసావ రూపొందించిన ‘రషోమాన్‌’లోనూ ఇదే తరహా కథన రీతి కనిపిస్తుంది. దాదాపు యాభయ్యేళ్ళ తర్వాత జెర్మన్‌ దర్శకుడు టాం టైక్వా రూపొందించిన సినిమా ‘రన్‌ లోలా రన్‌!’లోనూ ఇదే తరహా కథనరీతి కనిపిస్తుంది. అయితే, ల్యాజ్లో ప్రత్యేకత కథనరీతిలో లేదు. లేదా, నవలలోని ప్రతి అధ్యాయాన్నీ టాంగో నృత్య ముద్రలను తలపించేలా తీర్చిదిద్దడంలోనూ లేదు. అంతకుమించి ఈ నవలను బెలా తార్‌ దర్శకత్వంలో ఏడుగంటల సినిమాగా రూపొందించడంలో అస్సలు లేదు– అలా చెయడంలోని సారాంశంలో ఉంది రచయిత– దర్శకుల విశిష్టత! ‘సైతాను సయ్యాట’ నవల మొత్తం ఓ పాడుపడిన పల్లెటురులో జరుగుతుంది. ఇందులో కథానాయకుడిలా ప్రవేశించిన పాత్రే నిజానికి ప్రతినాయకుడు. అతగాడే రచయ

Original source: sakshi.com
Read more on Kaizer News