Kaizer News

Karimnagar: వృద్ధ దంపతులను గెంటేసిన కొడుకుపై చర్యల

Karimnagar: వృద్ధ దంపతులను గెంటేసిన కొడుకుపై చర్యలు తీసుకోవాలి: ఐద్వా

· State - Telangana · hmtvlive.com

Shorts కరీంనగర్: కోతి రాంపూర్ లో నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకు వారిని ఇంటి నుంచి బయటకు వెళ్లిపొమ్మని వేధించడం అత్యంత బాధాకరమని, దేవులపల్లి లక్ష్మణ్–జయలక్ష్మి దంపతులకు తక్షణమే న్యాయం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తల్లి దండ్రులకు జరిగే విధంగా తన కొడుకు పై చర్యలు తీసుకుని రిజిస్ట్రేషన్ తిరిగి దంపతులకు రిజిస్ట్రేషన్ చేసే విధంగా రెవెన్యూ అధికారులను చర్యలు చేపట్టే విధంగా చర్య తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ జీవితాలను పిల్లల భవిష్యత్తు కోసం త్యాగం చేస్తారని, వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాల్సిన పిల్లలే వారిని నిర్లక్ష్యం చేయడం అమానవీయమని అన్నారు. దేవులపల్లి లక్ష్మణ్–జయలక్ష్మి దంపతులను వారి కొడుకు ఇంటి నుంచి గెంటివేశారని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.వృద్ధ దంపతుల పరిస్థితిని అధికారులు వెంటనే పరిశీలించి, వారికి భద్రత, నివాసం, ఆర్థిక సహాయం కల్పించడంతో పాటు, వారికి చట్టపరంగా రావాల్సిన హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులను పోషించకుండా, నిర్లక్ష్యం చేసే పిల్లలపై తల్లిదండ్రులు మరియు వృద్ధ పౌరుల పోషణ, సంక్షేమ చట్టం–2007 ప్రకారం చర్యలు తీసుకునేలా అధికారులు చొరవ చూపాలని నాగమణి కోరారు. వృద్ధ తల్లిదండ్రులను రోడ్డున పడేసే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. దేవులపల్లి లక్ష్మణ్–జయలక్ష్మి దంపతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన ఐద్వా అండగా నిలుస్తుంది అని కోనేటి నాగమణి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు ఉప్పునూటి లక్ష్మి, టౌన్ కార్యదర్శి చేని రోజా, కారుపాకలమ్మ మున్నా తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News