Kaizer News

Elkathurthi: సూరారంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’

Elkathurthi: సూరారంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ సంక్షేమ ఫలాలపై మంత్రి సమీక్ష

· State - Telangana · hmtvlive.com

Elkathurthi: హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండలం, సూరారం గ్రామంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న- పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామాజిక, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలనలో సూరారం గ్రామానికి అందిన సంక్షేమ ఫలాలు ప్రగతి నివేదిక ప్రజా పాలన ప్రభుత్వంలో సూరారం గ్రామానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు. - 475 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందుతుండగా, రూ.1.11 కోట్లు విడుదల అవుతున్నాయి. - గృహజ్యోతి పథకం ద్వారా 665 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి రూ.63.96 లక్షల లబ్ధి చేకూరింది. - మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 535 కుటుంబాలకు రూ.10.08 లక్షలు విడుదలయ్యాయి. - 71 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.50.92 లక్షలు అందాయి. - 71 మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.10.37 కోట్లు విడుదలయ్యాయి. - ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మూడు మహిళా సంఘాల ద్వారా 1,200 స్టీల్ బ్యాంక్ కిట్లు పంపిణీ చేశారు. ఒక్కో కిట్‌లో 13 రకాల వస్తువులు ఉన్నాయి. - 340 మంది రైతులకు రూ.2.87 కోట్లు రైతు రుణమాఫీ కింద విడుదలయ్యాయి. - 973 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.4.83 కోట్లు అందాయి. - 8 మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా కింద రూ.40 లక్షలు అందించారు. - 217 మంది రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.62.18 లక్షలు విడుదలయ్యాయి. - 47 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, 5 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు అందించారు. - గ్రామంలో 158 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. - గ్రామంలోని 3,380 యూనిట్లకు సన్న బియ్యం పంపిణీ జరుగుతోంది. సూరారం గ్రామానికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్, ప్రజలు చేసిన విజ్ఞప్తిపై మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. గ్రామానికి బస్సు మంజూరు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. హుజురాబాద్–హనుమకొండ మధ్య సూరారం మీదుగా బస్సు నడిపించాలని ఆదేశించగా, రెండు రోజుల్లో బస్సు సర్వీసును ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి హామీ సూరారం గ్రామంలో విద్యుత్ సరఫరా, తాగునీరు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, కొత్త కాలనీలకు విద్యుత్ స్తంభాలు, అంగన్వాడీ భవనాలు తదితర సమస్యలను గ్రామ సర్పంచ్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సూరారం - పొలాడ్ పల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, సూర

Original source: hmtvlive.com
Read more on Kaizer News