Shorts Adilabad: ఆదిలాబాద్ లో విమానాశ్రయం మరియు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణాల పేరుతో భూములు కోల్పోతున్న నిర్వాసితులైన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం మరియు తగిన పునరావాసం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతాంగానికి వారు కోరుతున్న రీతిలో మార్కెట్ ధరకు అనుగుణంగా న్యాయసమ్మతమైన పరిహారం చెల్లించాలి. భూ నిర్వాసిత కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. ఎయిర్‌పోర్ట్ మరియు ఇండస్ట్రియల్ కారిడార్ భూ నిర్వాసిత రైతుల హక్కుల కోసం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’