సదాశివనగర్, ఆంధ్రప్రభ : వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సై ఎం.పుష్పరాజ్ పేర్కొన్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు,యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు