Kaizer News

Kothagudem: 108 రకాల ప్రసాదాలతో లక్ష్మీ గణపతికి వి

Kothagudem: 108 రకాల ప్రసాదాలతో లక్ష్మీ గణపతికి విశేష పూజలు!

· State - Telangana · hmtvlive.com

Shorts కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ మేదరబస్తి 53వ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గత 17 సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా డివిజన్ కార్పొరేటర్ బండి నర్సింహ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీ గణపతి స్వామివారికి 108 రకాల ప్రసాదాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భగత్‌సింగ్ కాలనీతో పాటు డివిజన్ పరిధిలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులతో సందడి నెలకొంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News