ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలి సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాయకర్ నర్సాపురం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంతో బాటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఉద్యోగులకు సూచించారు. ఇంటింటికి నాయకర్ కార్య క్రమంలో భాగంగా శనివారం ఆయన పట్టణంలోని 5వవార్డులో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వార్డులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలుపై ఆరా తీశారు. ఇందులో భాగంగానే సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యా లయలను ఆయన విజిట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన ఆయా కార్యాలయాలలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందాల్సిన సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. కార్యా లయాలలోని రికార్డులు, పత్రాలను, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవ హరించాలని, వారికి సత్వర సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజా భిప్రాయం సరిగా లేదని, దానిని మెరుగు పరుచు కోవాలని , ఆఫీసు పని టైమ్ లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్యోగులకు సూచించారు . కార్యాలయ ఆవరణలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవాలని సిబ్బందికి సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంనకు వచ్చిన ఎమ్మెల్యే నాయకర్ కు సబ్ రిజిస్ట్రార్ జీవన్ బాబు, సీనియర్ అసిస్టెంట్ నిరంజన్ లు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. తహసీల్దార్ కార్యాలయంలో వి ఆర్ ఓ లు మిరియాల లక్ష్మీ నారాయణ, చిరంజీవి లు ఎమ్మెల్యే నాయకర్ కు కార్యాలయం ద్వారా అందుతున్న సేవలను వివరించారు. ఎమ్మెల్యే వెంట అధికారులు, జనసేన నాయకులు , వీర మహిళలు ఉన్నారు