Kaizer News

పంటను కాపాడుకునేందుకు రైతన్న వినూత్న ప్రయత్నం

పంటను కాపాడుకునేందుకు రైతన్న వినూత్న ప్రయత్నం

· State - Telangana · prabhanews.com

మంథని టౌన్, ఆంధ్రప్రభ: పంటను కోతుల బారి నుంచి కాపాడుకునేందుకు ఓ రైతన్న చేసిన వినూత్న ప్రయత్నం స్థానికులను ఆకట్టుకుంటోంది. పొలంలో మనిషి ఆకారంలో ఓ బొమ్మను తయారు చేసి, దానికి హెల్మెట్‌ తగిలించాడు. దూరం నుంచి చూస్తే పొలంలో నిజంగానే ఓ వ్యక్తి నిలబడి ఉన్నట్లు కనిపించేలా ఈ ఏర్పాటు చేశాడు. పొలంలో మనిషి ఉన్నాడేమోనన్న భయంతో కోతులు అటువైపు రాకుండా వెనుదిరుగుతున్నాయని రైతు చెబుతున్నాడు. తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకునేందుకు రైతన్న వేసిన ఈ తెలివైన ఎత్తుగడపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రైతన్న ఐడియా అదుర్స్ అంటూ అభినందిస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News