Kaizer News

Guntur: డీఆర్‌సీ, డీసీసీ సమావేశాలు నిర్వహించిన కేం

Guntur: డీఆర్‌సీ, డీసీసీ సమావేశాలు నిర్వహించిన కేంద్రమంత్రి పెమ్మసాని

· State - Telangana · hmtvlive.com

Shorts గుంటూరు: గుంటూరులోని కలెక్టరేట్ లో గల శంకరన్ మినీ హాల్లో జిల్లా సమీక్ష సమావేశం(DRC) అలాగే జిల్లా సంప్రదింపుల కమిటీ(DCC) మరియు జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీలతో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక సమీక్ష సమావేశాలను వేర్వేరుగా శుక్రవారం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల గురించి వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించాము. * ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించి ప్రముఖంగా తాగునీటి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. * పెన్షన్ల అంశం లో కూడా ఎదురవుతున్నటువంటి సమస్యలపై కూడా ఈ సందర్భంగా చర్చించాము. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ MP భాష్యం రామకృష్ణ , గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ , తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ , పొన్నూరు నియోజకవర్గ MLA ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ , గుంటూరు పశ్చిమ నియోజకవర్గ MLA గల్లా మాధవి , కలెక్టర్ సాయి కాంత్ వర్మ , జాయింట్ కలెక్టర్ అసుతోష్ శ్రీ వాస్తవ , RDO శ్రీనివాస్ , DRO ఖాజావలి , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా LDO బి. రవీంద్రబాబు , యూనియన్ Bank of ఇండియా DGM A. హనుమంతరావు, NABARD DDM శరత్ బాబు అలాగే యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, AP గ్రామీణ బ్యాంకు ల నుంచి సంబంధిత ప్రతినిథులు, తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News