Kaizer News

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌ బోణీ

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌ బోణీ

· Sports · sakshi.com

దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో థాయ్‌లాండ్‌ బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ జట్టు 6 పరుగుల తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన థాయ్‌లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. కెపె్టన్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నరుమోల్‌ చాయ్‌వై (31 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. హాంకాంగ్‌ బౌలర్లలో మరీనా 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హాంకాంగ్‌ తడబడింది. ఒక దశలో 84/3తో పటిష్ట స్థితిలో కనిపించిన హాంకాంగ్‌ జట్టు... చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులకే పరిమితమైంది. కారీ చాన్‌ (28; 4 ఫోర్లు), యాస్మీన్‌ (28; 2 ఫోర్లు), మరీనా (11 బంతుల్లో 22; 4 ఫోర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. నేడు జరగనున్న మ్యాచ్‌లో యూఏఈతో శ్రీలంక తలపడనుంది. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News