Kaizer News

Achanta: నిత్య శ్రామికుడు ప్రధాని మోదీ: బీజేపీ నేత

Achanta: నిత్య శ్రామికుడు ప్రధాని మోదీ: బీజేపీ నేతలు!

· State - Telangana · hmtvlive.com

Shorts ఆచంట: భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఆచంట కచేరీ సెంటర్ లో యస్సీ మోర్చా అధ్యక్షులు ఈతకోట నరేష్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల బిజెపి అధ్యక్షుడు నేదునూరి శ్రీనుబాబు మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ సంక్షేమం కోసం తన ఇరవై ఐదు సంవత్సరాల పదవీకాలం లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా తన పూర్తి సమయాన్ని దేశసేవకు వినియోగిస్తూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, మహిళలు,యువత, రైతుల సంక్షేమం కోసం దేశం లోని అన్ని వర్గాల ప్రజల ఉన్నతి కి పాటుపడుతున్న నిత్య శ్రామికునకు దేశ ప్రజలు ఆశీర్వాద దీపం తో ఆయన పుట్టిన రోజు ను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఆచంట లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలుగు దేశం,జనసేన ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ కూటమి నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షులు చిలుకూరి సీతారాం,జనసేన మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ, టిడిపి నాయకులు కోళ్ళ సత్యనారాయణ, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అందే బసవ గణపతి,నాయకులు చామన శ్రీనివాస్, దిర్సిపో శ్యాంబాబు, వేండ్ర సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News