లక్ష్మీపురమనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. రంగయ్య చాలా నిజాయితీపరుడు. మరుక్షణంలో ప్రాణం పోతుంది అన్నా సరే, కష్టంలో ఉన్నవారి మేలు కోరే మంచి మనిషి. రంగయ్యకు భార్య వెంకటమ్మ, కూతురు బంగారు తల్లి ఉన్నారు. గ్రామంలో కూడా రంగయ్యకు చాలా మంచి పేరుంది. పేరుకే పేదవాడే గానీ సహాయపడటంలో శ్రీమంతుడు. తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉంటూ ఉండగా, ఒకరోజు పొలం దగ్గరకు వెళ్లి దిగులుగా ఉన్న రంగయ్యను చూసిన తన స్నేహితుడు దివాకరం, ఏం చెప్పమంటావ్ దివాకరం. మన ఊళ్ళో వాళ్ళందరూ చెరుకు తోటే పండిస్తున్నారు కానీ, ఒక్కరు కూడా వరి నాట్లు వేయడం లేదయ్యా. మనమంతా రైతులే అయినా, ధాన్యం కోసం పక్క గ్రామానికి వెళ్లి కొనాల్సి వస్తుంది. నువ్వు చెప్పింది నిజమే కానీ, మన ఊరికి దగ్గర్లో చెరుకు ఫ్యాక్టరీ ఉంది. అందుకే చెరుకు పండిస్తున్నారు. బయటకు తీసుకెళ్లి అమ్మనక్కరలేదు కదా. వాళ్లే వచ్చి తీసుకెళ్తున్నారు. రవాణా ఖర్చులు కూడా మిగులుతాయి. నష్టపోకుండా సరిపడ డబ్బులు ఇస్తున్నారు. ఈ లెక్కన బాగానే గిట్టుబాటు అవుతుంది కదా. నేనూ అదే చెప్తున్నా దివాకరం. ఈ ఊళ్ళో ఒక్కరైనా వరి పండిస్తే, గ్రామస్తులందరూ అక్కడే ధాన్యం తీసుకుంటారుగా. అప్పుడు వరిపంటకు కూడా గిట్టుబాటు ఉంటుందిగా. అందరూ చెప్పేవాళ్ళైతే ఆచరించేది ఎవరు రంగయ్య. అసలు వరి పండుతాదో పండదో తెలియని పొలంలో చెరుకు తోట తీసేసి వరి పండించే సాహసం ఎవరు చేస్తారు? మనమా రైతుం. ఏ మాత్రం నష్టం వచ్చినా సరే, పొలానికి కొట్టాల్సిన మందు మనం తాగాల్సి వస్తుంది. అందుకే దివాకరం. నా పొలంలో చెరుకు తీసేసి, వరి పండిద్దాం అనుకుంటున్నా. నీకేమైనా మతి పోయిందా? సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖ పెడుతున్నావ్. ఇందాక నువ్వే కదా అందరూ చెప్పేవాళ్ళైతే, ఆచరించేది ఎవరని? నేనే ఆచరించి చూపిస్తాను. ఇక్కడ ఇంకో ముప్పు కూడా ఉంది రంగయ్య. ఒకవేళ నీ పొలంలో వరి బాగా పండిందనుకో, మిగతావాళ్ళు ఊరుకుంటారా? మనం ఎదగకపోయినా పర్వాలేదు. మన పక్కవాడు మాత్రం నూతిలో కప్పలా అక్కడే ఉండిపోవాలని అనుకునే సమాజం మనది. నీ ఎదుగుదలను ఓర్చుకోలేక పంట పాడు చేస్తారు కూడా. అలా అని చూస్తూ కూర్చోలేం కదా. ఆ బాధలేవో నేనే పడతా. రేపటి నుంచి చెరుకు తీసేసి, వరిని పండిస్తా. అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా భార్య వెంకటమ్మతో చెప్తాడు రంగయ్య. భర్త మాటకు అడ్డుపడని వెంకటమ్మ, రంగయ్య నిర్ణయాన్ని గౌరవించడంతో పొలంలో చెరుకు తీసేసి వరి నాట్లు వేస్తాడు. కొన్ని రోజుల తర్వాత, ఏవయ్యా? దాచుకున్న డబ్బులన్నీ ఆ పొలం మీద పెట్టుబడి పెట్టడమే కాకుండా, అందిరి కాడికి అప్పు తెచ్చావ్. అక్కడ వరి పండదని చెప్తున్నా, వినకుండా వరి నాటావ్. ఇప్పుడు అక్కడ వరి పంటగా పండకపోతే, అందరం ఉరేసుకు చావాలి. అట్లాంటి మాటలు మాట్లాడకే. మనం ఏనాడు ఎవరికీ చెడు చేయలేదు. అలాంటప్పుడు ఆ దేవుడు మనకు అన్యాయం ఎందుకు చేస్తాడే? అలా చూస్తా ఉండు. మన పంటంతా పచ్చని సేలతో పచ్చదనంగా మారిపోద్ది. నీకు తెలియదయ్యా, ఈ రోజుల్లో మంచితనం అని మడిగట్టుకొని కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంటాయి మన బ్రతుకులు. నువ్వా మన కోసం ఆలోచించకుండా, ఊరి బాగోగు కోసం ఆలోచిస్తున్నావ్. మన బ్ర