సంతకం చేశారు..! Andhra Prabha Top News రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. రష్యాపై కొత్త ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై శుక్రవారం ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టం ద్వారా రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అమెరికా ప్రభుత్వానికి లభించింది. ఈ పరిణామం రష్యా చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. కొత్త చట్టం ప్రకారం.. రష్యా నుంచి అత్యధికంగా ముడిచమురు లేదా సహజవాయువు దిగుమతి చేసుకునే ఐదు దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై 100 శాతం వరకు సుంకాలు విధించాల్సి ఉంటుంది. ఇందుకు ట్రంప్ పాలనకు 30 రోజుల గడువు ఇచ్చారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా రష్యా చమురు లేదా గ్యాస్‌ను కొత్తగా కొనుగోలు చేసే దేశాలు, రష్యా ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు సహకరిస్తున్న తొలి ఐదు దేశాల్లో ఉండేవి కూడా ఈ పరిధిలోకి రావచ్చు. ఈ చట్టంలో ఏ దేశాలపై సుంకాలు పడతాయో స్పష్టంగా పేర్లు పేర్కొనలేదు. ‘అత్యధికంగా దిగుమతి చేసుకునే ఐదు దేశాలు’ ఎలా నిర్ణయిస్తారన్న దానిపైనా పూర్తిస్థాయి స్పష్టత లేదు. దీంతో తుది నిర్ణయం తీసుకునే విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి గణనీయమైన స్వేచ్ఛ లభించింది. రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా ముందున్నాయి. దీంతో కొత్త చట్టం ప్రభావం ఈ రెండు దేశాలపై పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించే మార్గం ఈ చట్టంతో ఏర్పడే అవకాశం ఉంది. తక్షణమే భారత్‌పై సుంకాలు పడతాయని చెప్పే పరిస్థితి లేదు. ఏ దేశాలను లక్ష్యంగా చేసుకోవాలన్న దానిపై అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయి. కొత్త అమెరికా సుంకాలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చని భారత్ ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు.. చైనా మాత్రం అంతర్జాతీయ చట్టానికి ఆధారం లేని ‘దూరప్రాంత అధికార పరిధి’ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించింది. ఈ చట్టంలోని విస్తృత పదజాలం అధ్యక్షుడికి అధిక విచక్షణాధికారాన్ని ఇస్తోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడికి ఇచ్చిన విస్తృత అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Foundation for Defense of Democracies మాత్రం ఈ బిల్లులో దేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు అవసరమైన ప్రమాణాలు ఉన్నాయని, ఇతర సంబంధం లేని సుంకాలను విధించేందుకు ఇది ‘వెనుకదారి’ కాదని పేర్కొంది. ఈ చట్టం కేవలం రష్యా చమురు, గ్యాస్ రంగాలకే పరిమితం కాదు. రష్యా రక్షణ రంగంతోపాటు.. ఆంక్షలను తప్పించుకునేందుకు మాస్కోకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలకు ఇది అవకాశం కల్పిస్తోంది. అదే సమయంలో.. జాతీయ భద్రతా కారణాలను చూపుతూ సుంకాలు లేదా ఆంక్షలను మినహాయించే అధికారం కూడా ట్రంప్‌కు ఉంది. అంటే.. ఈ కొత్త అధికారాలను ఎంత కఠినంగా ఉపయోగించాలన్నది అమెరికా అధ్యక్షుడి నిర్ణయ