Kaizer News

తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా..ఐదున్న

తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా..ఐదున్నర కోట్ల మొక్కలు నాటిన్రు..వనమహోత్సవం 91 శాతం పూర్తి

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటికే 91 శాతం మొక్కలు నాటే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ ఏడాది శాఖ పరిధిలో మొత్తం 6.18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 5.61 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు గుంతల తవ్వకంలో 92 శాతం పురోగతి సాధించగా, మిగిలిన లక్ష్యాన్ని కూడా వర్షాలు అనుకూలంగా ఉన్న ప్రస్తుత సమయంలోనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల ప్రగతిని పరిశీలిస్తే.. నాలుగు జిల్లాలు నిర్దేశిత లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాయి. కామారెడ్డి (10.73 లక్షలు - 100%), హనుమకొండ (6.00 లక్షలు - 100%), రాజన్న సిరిసిల్ల (5.77 లక్షలు - 100%), నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ (22.61 లక్షలు - 100%) లక్ష్యం సాధించాయి.. వీటితో పాటు నిజామాబాద్ 99%, నల్గొండ 98%, ఖమ్మం 98%, వరంగల్ 96%తో మెరుగైన పనితీరు కనబరిచాయి. కాగా వనపర్తి 80% తో అట్టడుగున ఉంది. సూర్యాపేట 82%, కుమ్రం భీం ఆసిఫాబాద్ 82%, రంగారెడ్డి 83% మహబూబాబాద్ 83%, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ 84%తో వెనుకంజలో ఉన్నాయి. వెనుకబడిన జిల్లాల్లో తక్షణమే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మిగిలిన లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనంతో పాటు పోషకాహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా ఇళ్ల ఆవరణల్లో నాటేందుకు 2.75 కోట్ల మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 2.71 కోట్ల పండ్ల, నీడనిచ్చే మొక్కలను ప్రజలకు నేరుగా పంపిణీ చేశారు. కాగా వనమహోత్సవంలో భాగంగా సోమవారం మహబూబ్బాద్ జిల్లాలోని కేసముద్రంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఇతర ప్రముఖులు.. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటి ఆవరణలో నాటుకునేందుకు వీలుగా పండ్ల మొక్కలు, ఇతర మొక్కలను గృహస్థులకు పంపిణీ చేయనున్నారు. వనమహోత్సవం అనేది కేవలం లెక్కలు చూపించే ప్రభుత్వ కార్యక్రమం కాదు.. పచ్చని, ఆరోగ్యకరమైన తెలంగాణ నిర్మాణానికి ఇదొక ప్రజా ఉద్యమం. పంపిణీ చేసిన ప్రతి మొక్కనూ బతికించుకోవడమే అసలైన విజయం. మారుతున్న కాలంలో చిన్నారులు, మహిళలు, గర్భిణీలకు పోషకాహారం ఎంతో అవసరం. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆధారపడకుండా పెరట్లోనే తాజా పండ్లు లభించేలా జామ, ఉసిరి, మామిడి, సీతాఫలం, మునగ వంటి పండ్ల మొక్కలను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నాం. అయితే మొక్కలు పంపిణీ చేశామనే రికార్డుల కంటే.. అవి ఎంతవరకు బతికాయనేదే ముఖ్యం. పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రస్థాయి సిబ్బంది పంపిణీ చేసిన ప్రతి మొక్కనూ నాటించి, నీరు పోసి కాపాడేలా బాధ్యత తీసుకోవాలి

Original source: v6velugu.com
Read more on Kaizer News