Kaizer News

Guntur: ఇన్నర్ రింగ్ రోడ్ మూడో విడత పనులను పరిశీలి

Guntur: ఇన్నర్ రింగ్ రోడ్ మూడో విడత పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని

· State - Telangana · hmtvlive.com

గుంటూరు: ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ -3 పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు,శిల్పారామం నుంచి పలకలూరు వరకు ఇన్నర్ రింగ్ రోడ్ కోసం 48కోట్లతో పనులు ప్రారంభించాము. హై టెన్షన్ వైర్స్ తొలగించడానికి 2కోట్ల ఖర్చు అవుతుంది. ఇంకా రోడ్డును పేరిచర్ల వరకు పొడిగించాలి దీనికి 20కోట్ల పై చిలుకు ఖర్చు పెరుగుతుంది. దీనిని పొడిగించడం వలన ఆదాయ మెరుగుదల పెరుగుతుంది. గుంటూరు ఛానల్ 4వ విడత 17కోట్లు విడుదల చేశాం ఇంకా 13కోట్లు త్వరలో విడుదల చేస్తాం. అభివృద్ధి అనేది కూటమితో మాత్రమే సాధ్యం.. ఇన్నర్ రింగ్ రోడ్ 3వ్ ఫేజ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికోసం మేము 48కోట్ల రూపాయల తో ముమ్మరంగా పనులు చేస్తున్నాం. అభివృద్ధి నీ కళ్ళతో చూడండి, ఇన్నర్ రింగ్ రోడ్ మొదలు పెట్టింది మేమే పూర్తి చేసేది మేమే అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. పనులు చెడ కొట్టటానికి కాదు అభివృద్ధి కోసం పోటీ పడటానికి మీకు దమ్ముందా అని మరొక్కసారి సవాల్ విసిరిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు

Original source: hmtvlive.com
Read more on Kaizer News