చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలోని ఠాగూర్ విద్యాలయానికి చెందిన 8వ తరగతి విద్యార్థినులు పి. ఐశ్వర్య, సిహెచ్. అక్షర అండర్-14 బాలికల కబడ్డీ విభాగంలో జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన మండల స్థాయి పోటీల్లో వీరు పాల్గొని ప్రతిభ కనబరిచారు. మండలం నుంచి జిల్లా స్థాయికి ఇద్దరు బాలికలు మాత్రమే ఎంపిక కావడం, ఆ ఇద్దరూ ఠాగూర్ విద్యాలయ విద్యార్థినులే కావడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థినులను పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్, పీఈటీ లింగస్వామి, ఉపాధ్యాయులు అభినందించారు