Kaizer News

డివైడర్‌ను ఢీకొన్న కారు.. మంటల్లో దగ్ధం

డివైడర్‌ను ఢీకొన్న కారు.. మంటల్లో దగ్ధం

· State - Telangana · prabhanews.com

పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం కారులోని వ్యక్తి సజీవ దహనం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు సూర్యాపేట రూరల్, ఆంధ్రప్రభ: ఖమ్మం–హైదరాబాద్‌ 365 బీబీ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే కారులో ఒక్కరు మాత్రమే ఉన్నారా.. మరెవరైనా ఉన్నారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు పూర్తిగా కాలిపోవడంతో మృతుడి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రూరల్‌ ఎస్సై అనిల్‌రెడ్డి సంఘటనా స్థలంలో విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానుంది

Original source: prabhanews.com
Read more on Kaizer News