Kaizer News

Vijayawada: 7 రోజుల్లోగా లోపాలు సరిదిద్దుకోవాలని హ

Vijayawada: 7 రోజుల్లోగా లోపాలు సరిదిద్దుకోవాలని హోటళ్లకు ఆదేశం!

· State - Telangana · hmtvlive.com

Vijayawada: పరిశుభ్ర పరిమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని విజయవాడ నగర పాలక సంస్థ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39, 40, 41, 42వ శానిటరీ డివిజన్లలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నగరంలో పారిశుధ్య ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (AMOH) డాక్టర్ అన్నపూర్ణ పర్యవేక్షణలో శానిటరీ సూపెర్వైసర్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా తిరుమల రెస్టారెంట్, బాలాజీ హోటల్, పాండు హోటల్, గుప్తా టిఫిన్ సెంటర్ తదితర హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో గుర్తించిన నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రూ.4,000 జరిమానా విధించారు. తనిఖీల్లో భాగంగా హోటళ్లలో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార వ్యర్థాల నిర్వహణ, డస్ట్‌బిన్ల ఏర్పాటు, పరిసరాల పారిశుధ్యం తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. కొన్ని చోట్ల ఫుడ్ వేస్ట్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం, డస్ట్‌బిన్లు లేకపోవడం, పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం వంటి లోపాలను గుర్తించారు. లోపాలు గుర్తించిన సంబంధిత హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేసి, 7 రోజుల్లోగా లోపాలను సరిదిద్దుకోవాలని అధికారులు ఆదేశించారు. నిర్దేశిత గడువులో లోపాలను సరిచేయకపోతే ట్రేడ్ లైసెన్స్ రద్దుతో పాటు నిబంధనల ప్రకారం జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో శానిటరీ సూపర్‌వైజర్ ఎస్.వి.ఎస్. శ్రీధర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఆదినారాయణ, వి. శ్రీనివాస్, జె. దుర్గారావు, సిబ్బంది పాల్గొన్నారు. మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

Original source: hmtvlive.com
Read more on Kaizer News