ఆ పార్టీ ధోకాను ప్రజాక్షేత్రంలో ఎండగడుదాం రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుదాం వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్ సమరం సెప్టెంబర్ 2 నుంచి వారంపాటు నిరసనలు 420 బూటకపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి నాయకులు, శ్రేణులు భాగస్వాములు కావాలి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచన 1న తెలంగాణ భవన్‌లో సర్కార్‌పై చార్జ్‌షీట్ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌పై ఉన్నది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంది? వాటిలో ఎన్ని అమలయ్యాయి? ప్రజలకు ఇంకా ఏమేం బాకీ ఉన్నాయి? అనే అంశాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలి. ప్రతి నాయకుడు తన కార్యక్షేత్రంలో బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమవుతూ రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి. హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, అవినీతి ఆరోపణలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఇందుకోసం బీఆర్‌ఎస్ చేపట్టే వారం రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఏడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు దాటినా నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌పై ఉన్నదని పేరొన్నారు. పార్టీ నిర్ణయించిన కార్యాచరణను కేవలం కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చి న హామీలేంది? వాటిలో ఎన్ని అమలయ్యా యి? ప్రజలకు ఇంకా ఏమేం బాకీ ఉన్నాయి? అనే అంశాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. ప్రతి నాయకుడు తన కార్యక్షేత్రంలో బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమవుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వారం రోజు ల కార్యాచరణకు ముందుగా సెప్టెంబర్ 1న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చార్జిషీట్ వేస్తూ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత వరుసగా వారం పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం సెప్టెంబర్ 2న కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని తెలిపారు. కాంగ్రెస్ హామీల మోసాన్ని ప్రతీకాత్మకంగా ప్రజలకు తెలియజేసేందుకు భారీ ఫ్లెక్సీల ప్రదర్శనతో పాటు ‘420 హామీలు’ అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇదే సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం ఇంకా