ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి) : వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్ పర్సన్ గా నియమితులైన వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి శుక్రవారం నాడు హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలో సీఎంను కలిసి శాలువాతో సత్కరించారు. కుడా బాధ్యతలు అప్పగించినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిపై సీఎంతో చర్చించారు