Hanamkonda: పశ్చిమ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వ్యవహారం రాజకీయంగా కాక రేపుతోంది. ఆదివారం రాగన్న దర్వాజాలో జరగనున్న బోనాల పండుగ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, పాటు జంగా రాఘవరెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కొందరిని హనుమకొండ పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జంగా రాఘవరెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానంలో ఏకంగా అతని తండ్రినే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారంటూ స్థానికులు, యువకులు ఆరోపిస్తున్నారు. “ఫ్లెక్సీలు తొలగిస్తేనే మిమ్మల్ని బయటకు పంపిస్తాం” అంటూ సీఐ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కొందరు యువకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీల విషయంలో ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు, కొందరిపై మాత్రమే చర్యలకు దిగుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బోనాల పండుగ వేడుకల నేపథ్యంలో ప్రారంభమైన ఈ ఫ్లెక్సీ వార్ ఇప్పుడు పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసలు ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారా? లేక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఈ చర్యలు జరిగాయా? అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఫ్లెక్సీ కోసం తండ్రిని స్టేషన్‌కు తీసుకెళ్లారనే ఆరోపణలు. ఫ్లెక్సీలు తీస్తేనే విడుదల చేస్తామన్న హెచ్చరికలంటూ విమర్శలు. పశ్చిమ రాజకీయాల్లో బోనాల పండుగకు ముందే మొదలైన ఫ్లెక్సీ వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’