Kaizer News

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

· State - Telangana · prabhanews.com

నల్లగొండ మండల స్థాయి సమావేశంలో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవోలు. నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : అధికారులు సమన్వయంతో పనిచేయాలని నల్లగొండ మండల ప్రత్యేకాధికారి, వెటర్నరీ జెడిఎ రమేష్ అన్నారు. శనివారం నల్లగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు తప్పనిసరిగా సమావేశానికి హాజరై గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. ఎంపీడీవో భూక్యా యాకూబ్ నాయక్ మాట్లాడుతూ మండల స్థాయి సమావేశానికి హాజరయ్యే అధికారులు పూర్తి సమాచారంతో తప్పనిసరిగా రావాలని గైర్హాజరయితే కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించే ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని కోరారు‌ కాగా ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు పలు సమస్యలపై తమ గళం వినిపించారు. దీపకుంట సర్పంచ్ గూడూరు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మహిళా సంఘం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, చిన్న చిన్న కారణాలతో మహిళా సంఘాలకు ఆయా బ్యాంకర్లు లోన్లు ఆపుతున్నారని, సంపూర్ణ మద్యపానం అమలు కోరుతూ తీర్మానం చేసినప్పటికి ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడంలేదని, గ్రామంలో ఇండ్లు కట్టుకునే వారిని గుర్తించి ప్రభుత్వ సాయం అందించాలని అధికారులను కోరారు. రసూల్ పురం (బసిరెడ్డిపల్లి) సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్ మాట్లాడుతూ అన్నారం గ్రామ చివరిలో ఆర్ అండ్ బి రోడ్డు ఎడ్జ్, ఫిల్లర్లు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు ఇచ్చిన ఎజెండా పూర్తిగా తెలుగులో ఉండాలని, పూర్తి సమాచారం అందించాలని సూచించారు. వెలుగుపల్లి సర్పంచ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ రహదారిపై రహదారులపై ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు. మేళ్లదుప్పలపల్లి చెరువును కాలువ నీటితో నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని సర్పంచ్ సంధ్యారాణి కోరారు. అన్నెపర్తి సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో డ్రైనేజీల సమస్య ఉందని, డ్రైనేజీల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో నిధులు అందించాలని కోరారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎఈఈ షఫీయుద్ధీన్, వెటర్నరీ కోట్ల సందీప్ రెడ్డి, హార్టికల్చర్ అనంతరెడ్డి, వ్యవసాయాధికారి సుంకోజు శ్రీనివాస్, ఎపియం వినోద, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, సర్పంచులు గంగుల అండాలు సైదులు, మర్రి సతీష్, బుచ్చిరాజు, సిహెచ్. శంకర్, ముప్పిడి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News