Kaizer News

అశ్విన్ అట్టర్ ప్లాప్.. బౌలింగ్‌లో పరుగులు! బ్యాటి

అశ్విన్ అట్టర్ ప్లాప్.. బౌలింగ్‌లో పరుగులు! బ్యాటింగ్‌లో డకౌట్

· Sports · sakshi.com

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ 2026లో రవిచంద్రన్ అశ్విన్ సారథ్యంలోని డబ్లిన్ గార్డియన్స్ వ‌రుస‌గా రెండో ఓట‌మి చ‌విచూసింది. వూర్బర్గ్ వేదిక‌గా గ్లాస్గో కాస్మిక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 33 ప‌రుగుల తేడాతో డ‌బ్లిన్ ఓట‌మి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గ్లాస్గో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. గ్లాస్గో ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌ అద్భుత హాఫ్‌ సెంచరీతో సత్తాచాటాడు. 37 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 60 పరుగులు చేశాడు. అతడితో పాటు రిచీ బెరింగ్టన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. డబ్లిన్‌ బౌలర్లలో మాథ్యూ హోల్డర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. డబ్లిన్‌ కెప్టెన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అశ్విన్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 43 పరుగులిచ్చి ఒకే ఒక వికెట్‌ పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో డబ్లిన్‌ గార్డియన్స్‌ 19.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. డబ్లిన్‌ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్‌(75) ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. బ్యాటింగ్‌లో కూడా అశ్విన్‌ నిరాశపరిచాడు. అశూ రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. గ్లాస్గో బౌలర్లలో లుంగీ ఎంగిడి నాలుగు, పాల్‌ వాన్‌ మీకరన్‌ మూడు వికెట్లు సాధించాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. టీమిండియా నుంచి ఆ ఇద్దరికే చోటు! ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News