ఇంగ్లాండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ సిక్కు బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తి అతడిని బస్సు నుంచి బయటకు తోసేసి వాహనాన్ని అపహరించాడు. అనంతరం బస్సును రాంగ్ రూట్‌లో వేగంగా నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. . జాతీయ రహదారిపై కారులో చెలరేగిన మంటలు.. వైద్యుడు సజీవదహనం సెప్టెంబర్ 18వ తేదీన సాయంత్రం 6:30 గంటల సమయంలో మేడ్లీ ప్రాంతంలోని కోర్ట్ స్ట్రీట్‌లో ఈ ఘటన జరిగినట్లు వెస్ట్ మెర్సియా పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. అలీ బల్హాద్ అనే 33 ఏళ్ల యెమెన్ జాతీయుడు బస్సు డ్రైవర్‌పై దాడి చేశాడు. వీడియోలో నిందితుడు డ్రైవర్ గడ్డాన్ని పట్టుకుని, అతడి తలను కొట్టడం కనిపించింది. దాడి అనంతరం డ్రైవర్‌ను బస్సు నుంచి బయటకు తోసేసిన నిందితుడు డ్రైవర్ సీట్లోకి వెళ్లి బస్సును నడిపాడు. పార్క్ వే మీదుగా హై స్ట్రీట్ వైపు రాంగ్ రూట్ లో బస్సును నడిపి పలు వాహనాలను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెస్ట్ మెర్సియా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, మరెవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. నిందితుడు అలీ బల్హాద్‌పై పలు రకాల సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. అతడిని కస్టడీలో ఉంచారు. సెప్టెంబర్ 21న టెల్‌ఫోర్డ్ మేజిస్ట్రేట్స్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు, అలాగే సీసీటీవీ, డ్యాష్‌క్యామ్, మొబైల్ ఫోన్ లేదా డోర్‌బెల్ కెమెరా ఫుటేజీ ఉన్నవారు తమను సంప్రదించాలని అధికారుల కోరారు