Kaizer News

‘ఖిల్లా’ విద్యార్థికి బంగారు పతకం

· State - Telangana · sakshi.com

ఖిల్లాఘనపురం: జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఖిల్లాఘనపు రం మండలంలోని ప ర్వతాపురం గ్రామాని కి చెందిన కదిరె ఉద య్‌కిరణ్‌ బంగారు పతకం సాధించాడు. పాండిచ్చేరిలో శుక్రవారం నిర్వహించిన 37వ సౌత్‌జోన్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌–2026 అండర్‌–18 విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఉదయ్‌కిరణ్‌ లాంగ్‌జంప్‌లో 6.86 మీటర్ల దూరం జంప్‌చేసి బంగారు పతకాన్ని సాధించాడు. ఇటిక్యాల: ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బీచుపల్లి ఆంజనేయస్వామి దేవస్థానం 205 రోజుల హుండీని శుక్రవారం విజయరాయ కల్యాణ మండపంలో దేవాదాయశాఖ డివిజన్‌ పరిశీలకురాలు వెంకటేశ్వరి, ఆలయ ఈఓ పురేందర్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గద్వాల శాఖ సిబ్బంది, మహిళా సేవా సమితి సభ్యుల సమక్షంలో చెల్లించారు. ఇందులో భాగంగా నోట్ల రూపంలో రూ.37,19,705, నాణేల రూపంలో రూ.2,65,461 కలిపి మొత్తం రూ.39,85,166 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా 1.680 కిలోల మిశ్రమ వెండి సమకూరిందన్నారు. వెల్దండ: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన కొట్రగేట్‌ వద్ద ఉన్న పెట్రోల్‌బంక్‌ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలంలోని దేవల్‌తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన మిద్దె చిన్న నరసింహ (58) గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూర్‌లో ఉన్న కుమార్తె వద్దకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరాడు. కల్వకుర్తిలో బస్సుదిగిన ఆయన దారి మరిచిపోవడంతో కాలినడకను హైదరాబాద్‌ రోడ్డులో నడుచుకుంటూ వెళ్లి ఉండవచ్చన్నారు. కొట్రగేట్‌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం వారి వద్ద ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు కురుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు. కల్వకుర్తి టౌన్‌: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలా ప్రకారం మండలంలోని తర్నికల్‌ గ్రామానికి చెందిన అరవింద్‌(25) పట్టణంలోని గచ్చుబావి రోడ్డులో హెయిర్‌ కటింగ్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు. దుకాణాన్ని మూసివేసి పట్టణంలోని గాంధీనగర్‌ కాలనీలో స్నేహితులు ప్రతిష్టించిన వినాయక మండపం వద్దకు వచ్చాడు. మండపం పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద విద్యుత్‌ తీగలు రోడ్డుపై పడి ఉండటాన్ని గుర్తించి, వాటిని పక్కకు తీసేందుకు పట్టుకోగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన అతని స్నేహితులు, స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. మరికొన్ని రోజులలో తన సోదరి వివాహం నిశ్చయం కావటం, కుటుంబానికి తోడుగా ఉంటాడని అనుకున్న కొడుకు మృతిచెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయ లు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి మార్చుర

Original source: sakshi.com
Read more on Kaizer News