Kaizer News

తొలుత 46 బంతుల్లోనే సెంచరీ.. ఆ తర్వాత 3 వికెట్లతో

తొలుత 46 బంతుల్లోనే సెంచరీ.. ఆ తర్వాత 3 వికెట్లతో బీభత్సం.. వచ్చేశాడ్రోయ్ మరో బ్రహ్మాస్త్రం..!

· Sports · tv9telugu.com

ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (DPL) 2026లో మరో సంచలన ఇన్నింగ్స్‌ నమోదైంది. సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ కెప్టెన్‌ జొంటీ సిద్ధూ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. పురానీ ఢిల్లీ-6తో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో కేవలం 46 బంతుల్లోనే అజేయ శతకం బాదాడు. ఏకంగా 10 సిక్సర్లు, 5 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం బంతితోనూ సత్తా చాటడంతో సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్‌ గెలిచిన పురానీ ఢిల్లీ-6 తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో కెప్టెన్‌ జొంటీ సిద్ధూ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. AFG vs IND: ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే.. ఆఫ్టాన్‌ను ఢీ కొట్టే భారత జట్టు ఇదే..? క్రీజులోకి వచ్చినప్పటి నుంచే అతడు దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ మైదానం నలువైపులా షాట్లు బాదాడు. క్రమంగా ఇన్నింగ్స్‌ వేగం పెంచి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. జొంటీ సిద్ధూ బ్యాటింగ్‌ వేగం చూసి ప్రత్యర్థి బౌలర్లు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైంది. కేవలం 46 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 10 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అతడి స్ట్రైక్‌రేట్‌ ఏకంగా 230.43. అంటే ప్రతి 4 బంతుల్లో దాదాపు 10 పరుగులు సాధించినంత వేగంగా అతడి ఇన్నింగ్స్‌ సాగింది. జొంటీ విధ్వంసంతో సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఎక్కువమంది చదివినది: IND vs NZ: లంక ఎఫెక్ట్.. కీవిస్‌తో సిరీస్ నుంచి ఐదుగురు ఔట్.. ఇకపై ఎంట్రీ కష్టమే..? బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఉతికేసిన జొంటీ సిద్ధూ.. బంతితోనూ తన సత్తా చాటాడు. లక్ష్య ఛేదనలో పురానీ ఢిల్లీ-6 బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ మ్యాచ్‌లో అతడి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన సెంట్రల్‌ ఢిల్లీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పురానీ ఢిల్లీ-6కు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. సెంట్రల్‌ ఢిల్లీ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. చివరకు పురానీ ఢిల్లీ 17.4 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సమర్థ్‌ సేథ్‌ 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ధనాంజని సింగ్‌ 34 పరుగులు చేయగా.. రజనీష్‌ దాదర్‌ 25 పరుగులు సాధించాడు. ఈ విజయంతో సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ DPL 2026 ఫైనల్‌కు అర్హత సాధించింది. టైటిల్‌ పోరులో సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్జ్‌తో తలపడనుంది. నాకౌట్‌ మ్యాచ్‌లోనే కెప్టెన్‌ జొంటీ సిద్ధూ బ్యాట్‌, బంతితో ఇంతటి ప్రభావం చూపడంతో ఫైనల్‌లోనూ అతడిపైనే జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఎక్కువమంది చదివినది: రాసిపెట్టుకోండి.. అలాంటోడు దొరకడం టీమిండియా అదృష్టం.. వదిలేశారో..! ఒక్క మ్యాచ్‌లోనే శతకం, మూడు వికెట్లు.. కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చ

Original source: tv9telugu.com
Read more on Kaizer News