Kaizer News

Tadigadapa: పోరంకిలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించ

Tadigadapa: పోరంకిలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే!

· State - Telangana · hmtvlive.com

Shorts Tadigadapa: పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో 33.60 లక్షల తాడిగడప మున్సిపాలిటీ సాధారణ నిధులతో పోరంకి ప్రభునగర్ శ్రీ నగర్ కాలనీ నందు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ & బోడే హేమ గారికి పూలవర్షంతో *ఘనస్వాగతం పలికిన స్థానిక ప్రజానీకం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ,ప్రజలకు సేవచేస్తే,నాయకులను తమ కుటుంబసభ్యులుగా భావించి గౌరవిస్తారని, కష్టపడి పనిచేస్తే కాస్త అలసిపోతామేమోకానీ, ప్రజల ఆదరాభిమానం ముందు ఎంత కష్టమైనా ఇబ్బంది ఉండదని అన్నారు. కూటమిప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గార్ల ఆశీస్సులతో ప్రజలకు జవాబుదారిగా ఉండాలన్న ఆలోచనతో పని చేస్తున్నామని, పెనమలూరు నియోజకవర్గ పరిధిలో తాడిగడప మున్సిపాలిటీలో గడచిన కూటమి ప్రభుత్వ పాలనలో కోట్లాది రూపాయలు వివిధ శాఖల ద్వారా మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రెయిన్లు నిర్మాణం చేయగలిగామని, తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు రవాణా సౌకర్యం ప్రశాంత వాతావరణం ఉండేలా తీర్చిదిద్దే ప్రయత్నానికి ప్రజల సహకారం అందించాలని స్పష్టం చేశారు... ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు,తదితరులు,పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News