తెలంగాణలోని వరంగల్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుండటంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు సరైన పేరు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ & తెలంగాణ టాప్ డైరెక్టర్స్ సందీప్‌రెడ్డి వంగా, శ్రీకాంత్ ఓదెల తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇద్దరూ వరంగల్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లను సూచించడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ విజనరీ డైరెక్టర్స్ సూచించిన ఆ పేర్లు ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకుందాం.. వరంగల్‌కు చెందిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఈ వార్తపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన సొంత ఊరైన వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం సాకారం కానుండటం సంతోషంగా ఉందంటూ పోస్టు పెట్టారు. ఎయిర్‌పోర్ట్‌కు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA)’ లేదా ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)’ పేర్లను సూచించారు. వరంగల్ ఘనమైన చరిత్ర, కాకతీయుల వారసత్వం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విమానాశ్రయానికి పేరు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్‌ను సాకారం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘దట్స్ ది స్పిరిట్’.. రేవంత్ కామెంట్‌కు వంగా రియాక్షన్! ఇక సందీప్‌రెడ్డి వంగా సూచించిన పేర్లపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. “That’s the SPIRIT..!!” అంటూ ఆయన రిప్లై ఇచ్చారు. ఈ ఒక్క మాటతోనే మరో ఆసక్తికరమైన ‘స్పిరిట్’ కనెక్షన్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్‌తో సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘స్పిరిట్’ కావడంతో.. సీఎం ఉపయోగించిన అదే పదం తన సినిమాలోని డైలాగ్ అని వంగా వెల్లడించారు. “That’s the Spirit” అనే లైన్‌ను తానే ‘స్పిరిట్’ సినిమాలో రాశానని, సీఎం రేవంత్‌రెడ్డి నుంచి అదే మాట రావడం తనకు ఆశ్చర్యంగా, చాలా సంతోషంగా అనిపించిందని వంగా తెలిపారు. సరైన వ్యక్తి నుంచి వచ్చినప్పుడు కొన్ని మాటలు మరింత ప్రత్యేకంగా అనిపిస్తాయంటూ సీఎం రిప్లైకి కృతజ్ఞతలు చెప్పారు. దీంతో రేవంత్‌రెడ్డి–సందీప్‌రెడ్డి వంగా మధ్య జరిగిన ఈ చిన్న సోషల్ మీడియా సంభాషణ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా వరంగల్ ఎయిర్‌పోర్ట్‌పై స్పందించారు. వరంగల్ అనేది కేవలం మ్యాప్‌లో కనిపించే ప్రాంతం కాదని.. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన నేల అని పేర్కొన్నారు. చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ఈ ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయం రావడం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్ట్‌కు ‘సమ్మక్క సారక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ అనే పేరును సూచించారు. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మ తల్లి–కూతుళ్ల స్ఫూర్తి, త్యాగం, వారసత్వాన్ని గౌరవించేలా ఈ పేరు ఉంటుందని తన పోస్టులో వివరించారు. ఇదే సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం తొలుత ‘సమ్మక్క’ అనే పేరును అనుకున్నట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు కూడా ‘సమ్మక్క సారక్క’ పేరు సూచించడ