టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ సంతానం అనయ బంగర్ ఆస్ట్రేలియాలో మహిళల క్రికెట్ ఆడేందుకు అర్హత సాధించడం అంతర్జాతీయ క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆస్ట్రేలియాలో ఎంట్రీ లెవల్ పోటీ అయిన కమ్యూనిటీ షీల్డ్ లో ఆమె ఎంపికవడంపై మిశ్రమ స్పందన కనిపస్తోంది. దక్షిణాఫ్రికా వెటరన్ మహిళా క్రికెటర్ మారిజానే కాప్ స్పందిస్తూ అనయ ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) లో ఆడాలని ప్రయత్నించడం పూర్తిగా హాస్యాస్పదమని తీవ్ర విమర్శలు చేసింది. కాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా టెస్టోస్టెరాన్ స్థాయిలు పరిమితిలో ఉంటే వచ్చే ఏడాది మార్చి నుంచి మహిళల ఎలైట్ క్రికెట్ లో పాల్గొనేందుకు అనయకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నిబంధనలు పాటిస్తున్నాను.. తనపై వస్తున్న విమర్శలకు అనయ బంగర్ నేరుగా కౌంటరిచ్చింది. "నా ఎంపికపై ఎవరైనా గళం విప్పాలని అనుకుంటే వారు మొదట ఈ అంశంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. నాకు ఎలాంటి ప్రత్యేక లేదా అన్యాయమైన ప్రయోజనం కలగడం లేదని తెలిపేందుకు అవసరమైన వైద్య సమాచారాన్ని ఇప్పటికే అందించాను. క్రికెట్ ఆస్ట్రేలియా రూపొందించిన నిబంధనలన్నింటినీ కచ్చితంగా పాటిస్తున్నాను. ఇది ఎవరిదైనా వ్యక్తిగత అభిప్రాయం అయితే వారు వెళ్లి నిబంధనలను అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను" అని ఆమె తాజాగా పేర్కొంది. అది తప్పనిసరి.. గతంలో సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడిన అనయ, ఈ ఏడాది మార్చిలో జెండర్ అఫర్మింగ్ సర్జరీ చేయించుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా పాలసీ ప్రకారం ఎలైట్ మహిళా క్రికెట్ లో ఆడాలంటే క్రీడాకారులు కనీసం 12 నెలల పాటు తమ సీరమ్ టెస్టోస్టెరాన్ సాంద్రతను 10 ఎన్ మోల్/లీటర్ కంటే తక్కువగా నిరంతరం కొనసాగించాల్సి ఉంటుందని సమాచారం. ఈ అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తేనే మార్చి 2027 నుంచి అధికారికంగా ఎలైట్ మ్యాచ్ లు ఆడే అవకాశం లభిస్తుంది. ప్రతిభను నిరూపించుకోవడమే టార్గెట్.. గత కొంతకాలంగా తాను సర్వైవల్ మోడ్ లో ఉన్నానని, అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగుతున్నానని అనయ తెలిపింది. "ప్రస్తుతం క్లబ్ క్రికెట్ లో ఆడి నా ప్రతిభను నిరూపించుకోవడమే నా ముందున్న లక్ష్యం. అక్కడ రాణిస్తే మహిళల బిగ్ బాష్ లీగ్ లో ఎంపికయ్యే ఛాన్స్ దక్కుతుంది. ఇక్కడి నుంచి ఒక్కో అడుగు ముందుకు వేయాలి, అయితే ఆడటానికి ఒక వేదిక దక్కడం ప్రధాన మైలురాయి" అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె స్థానిక క్లబ్ లతో చర్చలు జరుపుతూ ప్రాక్టీస్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. (IST) Tags : Sanjay Bangar Cricket Australia Marizanne Kapp Anaya Bangar Womens Big Bash League Anaya VS Kapp Breaking News, Anytime, Anywhere - Download ABPLIVE on Android and iOS now! Khelo khul ke, sab bhool ke - only on Games Live --> Advertisement టాప్ హెడ్ లైన్స్ క్రికెట్ విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లోకి అనయ బంగర్ ఎంట్రీ.. మారిజానే కాప్ విమర్శలకు కౌంటర్ తో సమాధానం.. క్రికెట్ దినుష వీక్‌నెస్ పసిగట్టడంలో టీమ్ ఇండియా ఘోరంగా విఫలం.. అంతమంది కోచ్ లు ఉండి ఏం లాభమని మాజీ క్రికెటర్ ఫైర్..! క్రికెట్ జపాన్ ఏర్పాట్లపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి.. ఏషియన్