Shorts అమలాపురం: ఈ రోజు అమలాపురం పట్టణం వడ్డిగూడెంలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు "మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతి సభ" ఆహ్వాన పత్రిక (పాంప్లెట్) ను ఆవిష్కరించారు.కోనసీమ రచయితల సంఘం,కోనసీమ రచయిత్రుల కవయిత్రుల సంఘం మరియు అంబాజీపేట గురజాడ సేవా కళా సమితి ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 21 (సోమవారం) ఉదయం 11:00 గంటలకు అమలాపురం నల్ల వంతెన వద్ద ఉన్న పరంజ్యోతి జూనియర్, టిపేషన్ కాలేజ్ మరియు మిరియం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ"దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా"అని చాటిచెప్పిన నవయుగ వైతాళికుడు, అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ వారి ఆలోచనలు నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ జయంతి సభకు కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు మరియు ప్రజలందరూ విశేషంగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు,కూటమి నాయకులు మరియు స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు