Shorts Station Ghanpur: కేసీఆర్ కుటుంబానికి 2014లో ఉన్న ఆస్తులు ఎన్ని 2024లో ఉన్న ఆస్తులు ఎన్నో తెలంగాణ ప్రజలకు చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు డిమాండ్ చేశారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్బంగా రఘునాథపల్లి మండలానికి సంబందించిన 24మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 24లక్షల 02వేల 784రూపాయల విలువగల చెక్కులను మరియు 35మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 18లక్షల 25వేల 500రూపాయల విలువగల చెక్కులను పంపిణి చేశారు. అనంతరం రఘునాథపల్లి మండల కేంద్రంలో 33లక్షలతో నిర్మించనున్న ఆహార దినుసుల గోదాం నిర్మాణానికి, 10లక్షలతో నిర్మించనున్న ఎస్సి కమ్యూనిటీ హల్ నిర్మాణానికి 10లక్షలతో నిర్మించనున్న కుర్మ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 10లక్షలతో నిర్మించిన వివో భవనం 10లక్షలతో నిర్మించిన సిసి రోడ్లతో పాటు గ్రామంలో నూతనంగా నిర్మించిన పలు ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ. తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం 10ఏళ్లలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని వందల ఎకరాల భూమిని ఆక్రమించుకురాని ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు ధరణిని అడ్డంపెట్టుకొని ఏ రకంగా పేదల భూములను ఆక్రమించుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వివరాలతో సహా వెల్లడించారాని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి 2014ఎన్నికల అఫిడవిట్ లో ఒక్క ఎకరం లేదని చెప్పి 2024 వచ్చే సరికి వందల ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులన్నీ కూడా అధికారాన్ని అడ్డంపెట్టుకొని అక్రమంగా సంపాదించినవే అని ఆరోపించారు. 2014కు ముందు మీ ఆస్తులు ఎన్ని ఇప్పుడు మీ ఆస్తులు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా మీరు నీతిమంతులే అయితే 2014 లో ఉన్న ఆస్తులు ఎన్ని 2024లో ఉన్న ఆస్తులు ఎన్ని.ఆ ఆస్తులు ఎలా వచ్చేయో తెలంగాణ ప్రజలకు చెప్పి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మునుపేన్నడూ లేని విధంగా 1600కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుంటే కొంతమంది కళ్ళకు కనిపించడం లేదని విమర్శించారు. 15ఏళ్ళు ఎమ్మెల్యే గా ఉన్న వ్యక్తి ఎం చేశాడో ప్రజలు ఆలోచించాలని తెలిపారు. చిల్లర పనులు, చిలిపి చేష్టలతో, అవినీతి, అక్రమాలతో నియోజకవర్గ పరువు తీశాడని ఆరోపించారు. 100పడకల ఆసుపత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, కాలువలకు మారమ్మత్తులు చేసి ప్రతీ గ్రామానికి చేరుతున్న గోదావరి జలాలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్లు, వివో భవనాలు, కమ్యూనిటీ హల్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. నియోజ