Kaizer News

వెలుగు స్పెషల్ : హసీనా అప్పగింతపై.. భారత్‌‌‌‌‌‌‌‌

వెలుగు స్పెషల్ : హసీనా అప్పగింతపై.. భారత్‌‌‌‌‌‌‌‌ నిర్ణయం ఏంటి?

· National - India · v6velugu.com

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రధాని తారిఖ్‌‌‌‌‌‌‌‌ రెహమాన్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌ పర్యటనను.. షేక్‌‌‌‌‌‌‌‌ హసీనాను తమకు అప్పగించాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌తో ఢాకా ముడిపెడుతోంది. ఇదే సమయంలో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 2న ‘ది ప్రింట్‌‌‌‌‌‌‌‌’కు ఇచ్చిన ప్రత్యేక టెలిఫోన్‌‌‌‌‌‌‌‌ ఇంటర్వ్యూలో హసీనా డిసెంబరులో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు తిరిగి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సూచించారు. దీంతో హసీనా అప్పగింతపై భారత్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాల్సిన నిర్ణయం మరోసారి చర్చనీయాంశమైంది. ఒక సార్వభౌమ దేశం తన దేశంలో నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదా దోషిగా నిర్ధారించిన వ్యక్తిని అప్పగించమని కోరడం సహజమే. కానీ హసీనా అప్పగింతపై నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. పూర్వాపరాల్లోకి వెళితే 2024 ఆగస్టులో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రం కావడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి వచ్చిన హసీనాకు భారత్‌‌‌‌‌‌‌‌ ఆశ్రయమిచ్చింది. అనంతరం బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌‌‌‌‌ ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌లో ఆమెపై విచారణ జరిగింది. పేరులో ‘ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌’ అని ఉన్నప్పటికీ ఇది ఐక్యరాజ్యసమితి లేదా అంతర్జాతీయ న్యాయస్థానంతో సంబంధం లేని, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ దేశీయ చట్టం కింద పనిచేసే ప్రత్యేక ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌ మాత్రమే. ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో, ఆమె గైర్హాజరీలోనే విచారణ కొనసాగి చివరకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు, ఆమె ఈ తీర్పుపై అప్పీలు కోరలేదు. ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన విచారణ, న్యాయప్రక్రియ పారదర్శకత, విధివిధానాలపై అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు పలు సందేహాలు లేవనెత్తాయి. బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ వాదనకు చట్టపరమైన ఆధారం ఉంది. భారత్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లు 2013లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఒక దేశంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న లేదా శిక్షపడిన వ్యక్తిని అప్పగించవలసిందిగా మరో దేశం కోరవచ్చు. హసీనా విషయంలో ఢాకా కోరుతున్నది కూడా అదే. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రైమ్స్‌‌‌‌‌‌‌‌ ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌ దోషిగా నిర్ధారించిన వ్యక్తిని తిరిగి తమకు అప్పగించాలన్నది ఢాకా అభ్యర్థన. అయితే ఈ ఒప్పందం.. అప్పగింత అభ్యర్థనను తిరస్కరించడానికి అవకాశం కల్పించే కొన్ని కారణాలను కూడా పొందుపరచింది. ముఖ్యంగా ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ 6లో రాజకీయ నేరారోపణలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కానీ హసీనా విషయంలో ఆ మినహాయింపులను నేరుగా వర్తింపజేయడం కుదరదు. ఎందుకంటే ఆమెపై ఉన్న ఆరోపణలు తీవ్ర నేరాలకు సంబంధించినవిగా బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ పేర్కొంటోంది. పైగా, ఆమె విచారణకు హాజరు కాకపోవడం చేత, ‘ఇది ఒక మాజీ ప్రధానిపై జరిగిన రాజకీయ కుట్ర’ అని సూత్రీకరించే అవకాశం కూడా అంతంత మాత్రమే. గైర్హాజరీలో విచారణ జరిగిందన్న కారణంతో ఆ తీర్పును భారత్‌‌‌‌‌‌‌‌ తిరస్కరించగలదా అన్నది కూడా జటిలమైన ప్రశ్నే.‌‌‌‌‌‌‌‌ ఎందుకంటే విచారణకు హాజరు కాకూడదన్నది ఆమె స్వచ్ఛంద నిర్ణయం. ఈ సందర్భంలో ఒప్పందంలోని ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ 8 కీలకమవుతుంది. అప్పగింతను తిరస్కరించగల కారణాల్లో ఒకటిగా ‘అప్పగింత అభ్యర్థన అన్యాయమైనది లేదా దమననీతితో కూడుకున్నది’ అనే కొలమానాన్ని ఈ ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ ని

Original source: v6velugu.com
Read more on Kaizer News