రోబోటిక్స్ పరిశ్రమ తన సొంత "చాట్‌జీపీటీ క్షణం" కోసం ఎదురుచూస్తోంది. 2022లో ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ ద్వారా జనరేటివ్ ఏఐని పరిచయం చేసి, అద్భుత బిజినెస్ ఐడియాకు బీజం వేసింది. అయితే ఒక రోబోతో మనం సొంత భాషలో మాట్లాడితే , అది మన ఇంట్లో పనులన్నీ పూర్తి చేయడానికి మరో 8 ఏళ్ల సమయం పడుతుందనీ, 2027 నాటికి రోబోల మెదడులో వాటి ఆలోచనా శక్తిలో అభివృద్ధిని కొంత మేర చూస్తామని చైనాకు చెందిన 'స్పిరిట్ ఏఐ' సహ వ్యవస్థాపకుడు గావో యాంగ్ తెలిపారు