Kaizer News

36 బంతుల్లో లేడీ సెహ్వాగ్ విధ్వంసం.. కట్‌చేస్తే..

36 బంతుల్లో లేడీ సెహ్వాగ్ విధ్వంసం.. కట్‌చేస్తే.. హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు బద్దలు.. అదేంటంటే..?

· Sports · tv9telugu.com

మహిళల టీ20 ఆసియా కప్‌-2026లో భారత జట్టు శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ షెఫాలీ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడమే కాకుండా.. తన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉన్న ఓ రికార్డును కూడా అధిగమించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఒక దశలో 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షెఫాలీ వర్మ ఒంటరి పోరాటం చేసింది. కేవలం 36 బంతుల్లోనే 64 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ అర్ధశతకం షెఫాలీ కెరీర్‌లో 19వది. ఆమె మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ 20 ఓవర్లలో 159/9 పరుగులు చేసింది. భారత్‌-థాయ్‌లాండ్‌ మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా ఇప్పటివరకు హర్మన్‌ప్రీత్ కౌర్‌ నిలిచింది. మ్యాచ్‌కు ముందు థాయ్‌లాండ్‌పై రెండు టీ20ల్లో హర్మన్‌ప్రీత్‌ 63 పరుగులు చేసింది. ఎక్కువమంది చదివినది: Team India: జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే..: సూర్య షాకింగ్ కామెంట్స్..! అయితే ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ 5 పరుగులకే వెనుదిరిగింది. మరోవైపు షెఫాలీ 64 పరుగులతో చెలరేగడంతో హర్మన్‌ప్రీత్‌ రికార్డును అధిగమించింది. థాయ్‌లాండ్‌పై ఇప్పటివరకు మూడు టీ20లు ఆడిన షెఫాలీ మొత్తం 114 పరుగులు సాధించింది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో షెఫాలీ వర్మ ఒకేసారి మూడు ఘనతలు సాధించింది. భారత్‌-థాయ్‌లాండ్‌ మహిళల టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. ఇరు జట్ల మధ్య టీ20ల్లో అర్ధశతకం చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. థాయ్‌లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను అధిగమించింది. అంతేకాదు.. భారత్‌-థాయ్‌లాండ్‌ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గానూ షెఫాలీ కొనసాగుతోంది. ఎక్కువమంది చదివినది: Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..! షెఫాలీ వర్మ 64 పరుగులతో భారత్‌కు మంచి స్కోరు అందించగా.. బౌలర్లు ఆ ఆధిక్యాన్ని విజయంగా మలిచారు. థాయ్‌లాండ్‌ 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షెఫాలీ బ్యాటింగ్‌ మెరుపులకు తోడు భారత బౌలర్ల విజృంభణతో ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా బోణీ కొట్టింది. ఈ విజయంతో టోర్నీలో భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Original source: tv9telugu.com
Read more on Kaizer News