Kaizer News

Asian Games | అట్టహాసంగా ఆసియా క్రీడలు ఆరంభం.. త్ర

Asian Games | అట్టహాసంగా ఆసియా క్రీడలు ఆరంభం.. త్రివర్ణం చేబూని భారత బృందం కవాతు..!

· National - India · ntnews.com

Asian Games : క్రీడాలోకం అమితాసక్తి కనబరుస్తున్న ఆసియా క్రీడలు(Asian Games 2026) ప్రారంభమయ్యాయి. అరకొర వసతులపై అసంతృప్తుల నడుమ జపాన్‌లోని నగోయ(Nagoya)లో శనివారం అట్టహాసంగా ఆరంభ వేడుకలు జరిగాయి. ఈ సెరొమొనీలో ఒలింపిక్ విజేత మనూ భాకర్ (Manu Bhaker), కబడ్డీ ఆటగాడు పవన్ షెహ్రావత్‌ (Pawan Sehrawat)లు భారత బృందానికి నేతృత్వం వహించారు. వీరిద్దరూ పతాకధారులుగా ముందు నడువగా.. అథ్లెటిక్స్ బృందం మువ్వన్నెల జెండాను చేబూని కవాతు చేసింది. ఆద్యంతం కన్నులపండువను తలపించిన ఈ దృశ్యం అనంతరం పతక వేట షురూ కానుంది. జపాన్ వేదికగా 20వ ఆసియా క్రీడలు మొదలయ్యాయి. ఆసియాలోని పలు దేశాల అథ్లెట్లు పతక వేటకు సిద్ధమవ్వగా శనివారం సంబురంగా ఆరంభ వేడుక నిర్వహించారు. మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో.. ఒలింపిక్ విజేత మనూ భాకర్, కబడ్డీ ఆటగాడు పవన్ షెహ్రావత్‌లు ఈ సెరెమొనీలో భారత బృందానికి పతాకధారులుగా వ్యవహరించారు. షూటర్ మనూతో షాట్‌పుటర్ తజిందర్‌పాల్ తూర్‌ మువ్వన్నెల జెండా చేబూని ముందు నడవాల్సింది. కానీ, అతడికి అధికారికంగా జెర్సీ అందడం ఆలస్యం కావడంతో ఆమెతో కలిసి పవన్ భారత దళానికి నేతృత్వం వహించాడు. ఆసియా క్రీడల ఆరంభం సందర్భంగా.. నగోయలో వసతుల కొరత, అసౌకర్యాలను పక్కనపెట్టేసి పతకంపై దృష్టి సారించాలని మనూ భాకర్ భారత బృందానికి సూచించింది. గత సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా వందకుపైగా పతకాలు లక్ష్యంగా మన అథ్లెట్లు పోటీ పడనున్నారు. 20వ ఆసియా క్రీడల్లో ఇండియా నుంచి 36 క్రీడా విభాగాల్లో.. 499 మంది పోటీ పడుతున్నారు. అక్టోబర్ 4వ తేదీ వరకూ ఈ మెగా టోర్నీ జరుగనుంది

Original source: ntnews.com
Read more on Kaizer News