Kaizer News

Indian Stock Market Analysis – Nifty 50 Weekly Out

Indian Stock Market Analysis – Nifty 50 Weekly Outlook – Nifty Support and Resistance Levels | భారత స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు.. నిఫ్టీకి వరుసగా ఆరో వారం నష్టం!

· National - India · prabhanews.com

భారత స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు.. నిఫ్టీకి వరుసగా ఆరో వారం నష్టం! వరుసగా ఆరో వారం నష్టాలతో ముగిసిన నిఫ్టీకి వచ్చే వారం కీలకంగా మారనుంది. 23,600 స్థాయి, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల విధానం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం భారత స్టాక్‌ మార్కెట్‌ దిశను నిర్ణయించనున్నాయి. మార్కెట్‌ రికవరీ అవకాశాలు, మద్దతు స్థాయులు, ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలపై పూర్తి విశ్లేషణ… Indian Stock Market Analysis – Nifty 50 Weekly Outlook – Nifty Support and Resistance Levels | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, బిజినెస్ ప్ర‌తినిధి : భారత స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. సెలవులతో కూడిన ఈ వారం నిఫ్టీ 50 వరుసగా ఆరో వారం నష్టాలతో ముగిసింది. వారం చివరిలో సూచీ కొంత కోలుకున్నప్పటికీ.. నష్టాల నుంచి పూర్తిగా బయటపడలేకపోయింది. వారం మొత్తంలో నిఫ్టీ 0.22 శాతం నష్టపోయి 23,600 స్థాయి దిగువన ముగిసింది. అంతకుముందు వారం నమోదైన దాదాపు 2 శాతం భారీ పతనంతో పోలిస్తే ఈసారి నష్టం స్వల్పంగానే ఉన్నప్పటికీ.. మార్కెట్‌లో ఒత్తిడి మాత్రం కొనసాగింది. వారంలో నిఫ్టీ 500 పాయింట్లకు పైగా హెచ్చుతగ్గులకు లోనైంది. ఇదే తరహా వరుసగా ఆరు వారాల నష్టాల పరంపర గత ఏడాది ద్వితీయార్థంలోనూ నమోదైంది. భారత మార్కెట్లకే పరిమితం కాకుండా ప్రధాన ఆసియా మార్కెట్లైన కొస్పి, నిక్కీ 225, హాంగ్‌కాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ సూచీలు కూడా ఈ వారంలో తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సంబంధిత షేర్లకు ఆయా మార్కెట్లలో ఉన్న అధిక ఎక్స్‌పోజర్‌ నష్టాలను కొంతమేర పరిమితం చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు అధిక స్థాయుల్లో కొనసాగడం భారత్‌ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళనగా మారింది. ఫెడ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌.. వడ్డీ రేట్ల ప్రభావం పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ 31 ఏళ్ల గరిష్ఠ స్థాయికి వడ్డీ రేట్లను పెంచడంతో పాటు.. రుణ వ్యయాలను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కూడా 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. మరింత కఠిన ద్రవ్య విధానానికి సంకేతాలు ఇవ్వడం మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికా ప్రతినిధుల సభ బుధవారం రష్యాపై ఆంక్షలు విధించేందుకు, రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు విస్తృత అధికారాలు కల్పించే బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు తదుపరి అధ్యక్షుడి ఆమోదానికి వెళ్లనుంది. పరిణామం అంతర్జాతీయ చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అంశంగా మారింది. క్రూడ్‌ ధరలు తగ్గినా.. ఆందోళన మాత్రం కొనసాగుతోంది ఇటీవలి రోజుల్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరల్లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ.. అవి ఇప్పటికీ అధిక స్థాయుల్లోనే ఉన్నాయి. క్రూడ్‌ ధరలు ఎక్కువ కాలం ఇదే స్థాయుల్లో కొనసాగితే భారత్‌పై ప్రభావ

Original source: prabhanews.com
Read more on Kaizer News