అంతర్రాష్ట్ర సోలార్ విద్యుత్తు కొనుగోళ్లు డిస్కమ్‌లకు గుదిబండగా మారుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్‌తో డిస్కమ్ మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ‘కరెంట్ వచ్చేదెప్పుడో.. కానీ భారం ఇప్పటి నుంచే’ అన్నట్టుగా ఉన్నదని, అంతిమంగా ఇది వినియోగదారులపై తీవ్రభారం మోపే ఒప్పందమని, దీనిని ఈఆర్సీ తిరస్కరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మూడు సంస్థల నుంచి 2,545 మెగావాట్ల సోలార్ విద్యుత్తును 25 ఏండ్ల కాలానికి కొనుగోలు చేసేందుకు డిస్కమ్‌లు రెడీ అయ్యాయి. ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఇటీవలే తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ)కి దరఖాస్తు చేశాయి