Kaizer News

లార్డ్స్‌లో పాక్ బౌల‌ర్ అరుదైన ఫీట్‌.. అక్ర‌మ్ వ‌ల

లార్డ్స్‌లో పాక్ బౌల‌ర్ అరుదైన ఫీట్‌.. అక్ర‌మ్ వ‌ల్ల కాలేదు!

· Sports · sakshi.com

పాకిస్తాన్ ఫాస్ట్‌ బౌల‌ర్ మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ ఇంగ్లండ్‌ గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు. లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌ద్వారా లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన ఏడో పాకిస్తాన్ బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. అయితే పాక్‌ దిగ్గజ బౌలర్‌గా పేరొందిన వసీం అక్రమ్‌కు లార్డ్స్ మైదానంలో ఒక్క ఐదు వికెట్ల హాల్‌ లేకపోవడం గమనార్హం. లార్డ్స్ లో 5 వికెట్లు తీసిన పాక్‌ బౌలర్లు 👉ఖాన్ మొహ‌మ్మ‌ద్ (1956లో) 👉ముద‌స్స‌ర్ న‌జ‌ర్ (1982లో) 👉వ‌కార్ యూనిస్ (1992లో) 👉ముస్తాక్ అహ్మ‌ద్ (1996లో) 👉మొహ‌మ్మ‌ద్ ఆమిర్ (2010లో) 👉యాసిర్ షా (2016లో) 👉తాజాగా మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ (2026లో) అంతేకాదు అబ్బాస్‌ ఐదు వికెట్ల ఫీట్‌తో లార్డ్స్ హాన‌ర్స్ బోర్డులోనూ చోటు ద‌క్కించుకున్నాడు. ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అబ్బాస్‌కు ఇదే మొద‌టి ఐదు వికెట్ల హాల్ కాగా, టెస్టుల్లో ఇది 8వ ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌ కావ‌డం విశేషం. గ‌తంలో సౌతాఫ్రికా గ‌డ్డ‌పై, బంగ్లాదేశ్ గ‌డ్డ‌పై, వెస్టిండీస్ గ‌డ్డ‌పై.. తాజాగా ఇంగ్లండ్ గ‌డ్డ‌పై కూడా ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసిన అబ్బాస్ అరుదైన ఫీట్ సాధించాడు. ఓవ‌రాల్‌గా మొమ‌హ్మ‌ద్ అబ్బాస్ పాకిస్తాన్ త‌ర‌ఫున 32 టెస్టుల్లో 128 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. 389 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ నాలుగో రోజు లంచ్ విరామ స‌మ‌యానికి 3 వికెట్లు కోల్పోయి 53 ప‌రుగులు చేసింది. సాద్ ష‌కీల్ (23), షాన్ మ‌సూద్ (15) క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు ఇంగ్లండ్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 208 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. చదవండి: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం.. షాక్‌లో సౌతాఫ్రికా! హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News