Kaizer News

విద్యార్థులు ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించాలి

విద్యార్థులు ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించాలి

· State - Telangana · prabhanews.com

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించుకోవాలి: ఎంఈఓ రామస్వామి తాడ్వాయి, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఇంగ్లీష్‌ భాషలో నైపుణ్యం సాధించి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలని మండల విద్యాశాఖ అధికారి రామస్వామి సూచించారు. శనివారం కృష్ణాజివాడి పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఇంటివద్ద ప్రత్యేకంగా ‘స్టడీ కార్నర్‌’ ఏర్పాటు చేసుకుని చదువుకోవాలని సూచించారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా క్రమం తప్పకుండా సాధన చేయాలని తెలిపారు. పరీక్షల్లో విద్యార్థులు తమ ప్రతిభ, సామర్థ్యాలను మరింత పెంపొందించుకునేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రామస్వామి కోరారు. పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారి మోహన్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని, సెల్‌ఫోన్‌ వినియోగాన్ని నియంత్రించేలా చూడాలని సూచించారు. సమాజంలో చోటుచేసుకునే అనైతిక, ప్రమాదకర ఘటనలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ తమ పిల్లలను కాపాడుకోవాలని కోరారు. సమావేశంలో తల్లిదండ్రులు తమ సందేహాలు, సూచనలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News