Kaizer News

Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..

· National - India · ntvtelugu.com

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పరిధిని పెంచే ఓ కీలక చట్టంపై శుక్రవారం సంతకం చేశారు. ఈ నూతన చట్టం ప్రకారం రష్యా నుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేసే భారత్, చైనాల వంటి దేశాలపై విపరీతమైన సుంకాలను (టారిఫ్‌లు) విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. 'లిండ్సే ఓ. గ్రాహమ్ రష్యా అండ్ ఇరాన్ శాంక్షన్స్‌ ఆక్ట్, 2026' పేరుతో రూపొందించిన ఈ ముసాయిదాకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బుధవారమే ఆమోదం తెలిపింది. ఈ బిల్లు కోసం సౌత్ కరోలినాకు చెందిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ఏడాదికి పైగానే శ్రమించారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం దీనికి ఆ పేరే పెట్టారు. వైట్ హౌస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ చట్టం రష్యాపై చట్టపరమైన ఆంక్షలు, సుంకాలు విధించేందుకు పూర్తి అధికారాలను ఇవ్వడమే కాకుండా, ఇరాన్‌పై ఇదివరకే ఉన్న ఆంక్షలను పొడిగిస్తుంది

Original source: ntvtelugu.com
Read more on Kaizer News