క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఆయన ముందుగా పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ ఆవరణను పచ్చదనంతో ఉంచాలని సూచిస్తూ మొక్కలు నాటారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న కేసుల ఫైళ్లు, రికార్డులు, కంప్యూటర్ వ్యవస్థ పనితీరు, సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణంలో నమోదైన పలు కేసుల పురోగతిపై సీఐ పరస రమేష్, ఎస్‌ఐ జాడి శ్రీధర్‌తో ఏసీపీ చర్చించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో స్టేషన్ ఇన్‌చార్జి నరసయ్య, హెడ్ కానిస్టేబుళ్లు కంకజంగు, వెంకటేశ్వర్లు, అఖిల్‌రెడ్డి, సునీల్‌కుమార్, సీసీటీఎన్‌ఎస్ సిబ్బంది బాలకృష్ణ, సాయికృష్ణ, మహిళా కానిస్టేబుల్ రమ్య, ఇతర స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు