ఇందిరమ్మ టవర్స్ ఇండ్లకు గత నెల చివరి వారంలో తీసిన లాటరీలో మా పేరు వచ్చింది. ఎంతో సంతోషం అనిపించింది. ఆ తర్వాత తెలిసింది... ఎంపిక కాగానే ఇల్లు రాదని, మళ్లీ ఇంటికొచ్చి పరిశీలిస్తారని. వారం కిందటే మా ఇంటికి అధికారులు వచ్చి చూసుకొని, ఆరా తీసి వెళ్లారు. కానీ ఇల్లు వస్తుందో రాదో చెప్పలేదు.