భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను దిద్ది మార్కులు వేసేవారు. ఇక నుంచి మూల్యాంకన ప్రక్రియ పదో తరగతి తరహాలోనే కొనసాగనుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 715 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 45,296 మంది విద్యార్థులు చదువుతున్నారు. నూతనంగా అమలులోకి రానున్న ఎక్స్‌టర్నల్ వాల్యుయేషన్ విధానంలో భాగంగా సమాధాన పత్రాలు దిద్దేందుకు మండల కేంద్రాల్లో వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మండల కేంద్రంలో పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులచే కాకుండా ఇతర ఉపాధ్యాయుల చేత కూడా దిద్దించనున్నారు. 1 నుంచి 9 తరగతులకు ఎస్‌ఏ–1 (అర్ధవార్షిక) ఎస్‌ఏ–2 (వార్షిక), పరీక్షలకు పదో తరగతికి ఎస్‌ఏ–1కు ఇది వర్తించనుంది. అదేవిధంగా 1 నుంచి 5వ తరగతుల సమాధాన పత్రాలను దిద్దేందుకు ఒక్కో పేపరుకు రూ. 2, 6నుంచి 10వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలు దిద్దేందుకు రూ. 3 చెల్లించనున్నారు. అదేవిధంగా ఒక్కో ఎంఆర్‌సీకి రూ.10వేల చొప్పున ఇవ్వనున్నారు. ఫ సమాధాన పత్రాలు దిద్దేందుకు మండలాల్లో వాల్యుయేషన్ కేంద్రాల ఏర్పాటు ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?