Kaizer News

‘నీ సోదరితో నేను పారిపోతే ఏం చేస్తావ్‌..?’ ఇంటర్వ్

‘నీ సోదరితో నేను పారిపోతే ఏం చేస్తావ్‌..?’ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ ఆన్సర్‌కి UPSC టాప్‌ ర్యాంక్‌

· State - Telangana · tv9telugu.com

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష అంటేనే దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీ పరీక్షల్లో ఒకటి. ఇందులో విజయం సాధించాలంటే కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు.. సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచన, పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ఎంతో ముఖ్యం. అందుకే యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అభ్యర్థుల ఆలోచనా విధానాన్ని పరీక్షించేలా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతుంటారు. ఇలాంటి ప్రశ్నకు సంబంధించిన ఓ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ‘If I run away with your sister, what would you do?’ అంటే.. ‘నేను నీ సోదరితో కలిసి పారిపోతే నువ్వేం చేస్తావు?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అభ్యర్థి ఇచ్చిన సమాధానం చాలా తెలివిగా, కాస్త నవ్వు తెప్పించే విధంగా ఉంది. నా సోదరికి మీకంటే మంచి వ్యక్తి దొరకడు (My sister cannot find anyone better than you) అని సమాధానం ఇచ్చాడు. సాధారణంగా ఇలాంటి ప్రశ్న విన్నప్పుడు చాలామంది కంగారుపడే అవకాశం ఉంటుంది. కానీ అభ్యర్థి మాత్రం ప్రశ్నలోని పరిస్థితిని సానుకూలంగా మలుచుకుని, ఎదుటివారిని మెప్పించే విధంగా సమాధానం ఇచ్చాడు. దీంతో అతడి సమయస్ఫూర్తి, హాస్యచతురత ఈ సమాధానంలో కనిపించడంతో ఇంటర్వ్యూ ప్యానెల్‌ ఫిదా అయింది. అంతే యూపీఎస్సీ రిజల్ట్స్‌లో టాప్‌లో నిలిచాడు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థుల నుంచి కేవలం వాస్తవాల ఆధారిత సమాధానాలనే ఆశించరు. ఒక పరిస్థితిని ఎలా అర్థం చేసుకుంటారు? ఒత్తిడిలో ఎలా స్పందిస్తారు? ఎదుటివారి ప్రశ్నకు ఎంత ప్రశాంతంగా సమాధానం చెబుతారు? వంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. అందుకే కొన్ని ప్రశ్నలు మొదట వినడానికి సరదాగా లేదా ఊహించని విధంగా అనిపించినా.. వాటి వెనుక అభ్యర్థి ఆలోచనా విధానం, నిర్ణయ సామర్థ్యం, సమయస్ఫూర్తి వంటి లక్షణాలను అంచనా వేయాలనే ఉద్దేశం ఉండవచ్చు

Original source: tv9telugu.com
Read more on Kaizer News