Kaizer News

Anakapalli: తుమ్మపాలలో డ్రైనేజీ ఆక్రమణలకు చెక్.. 3

Anakapalli: తుమ్మపాలలో డ్రైనేజీ ఆక్రమణలకు చెక్.. 30 ఏళ్ల సమస్యకు మోక్షం

· State - Telangana · hmtvlive.com

Shorts అనకాపల్లి: అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలోని గవరపేట వీధిలో సుమారు 30 ఏళ్లుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఏళ్లుగా డ్రైనేజీలను ఆక్రమించుకోవడంతో మురుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాలు, తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి పీల గోవింద్ చొరవతో గ్రామంలోని కూటమి నాయకులు డ్రైనేజీ ఆక్రమణలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. డ్రైనేజీలను పునర్నిర్మించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో వాటర్ పైప్‌లైన్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం పూర్తయితే మురుగునీటి పారుదల సమస్య తొలగడంతో పాటు గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించి డ్రైనేజీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి, సమస్య పరిష్కారానికి సహకరిస్తున్న కూటమి నాయకులు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 30 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News